telugu navyamedia
సినిమా వార్తలు

7 రోజుల్లో రూ.700 కోట్లు క్రాస్ చేసిన ఆర్ ఆర్ ఆర్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్​, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్​ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​. మార్చి 25న రిలీజైన ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కనక వర్షం కురిపిస్తోంది.

 ప్రస్తుతం ఎవరి నోట విన్న ఆర్ఆర్ఆర్ డైలాగులు, పాటలు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి దర్శక ధీరుడు రాజమౌళి స్క్రీన్ పైన చేసిన మ్యాజిక్ అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది ఈ మూవీ. బొమ్మ పడకముందే..అటు ఆట మొదలవక ముందే.... రేటింగ్స్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోయిన జక్కన్న ట్రిపుల్ ఆర్... అనుకున్నట్టే థియేటర్లను షేక్ చేస్తోంది.

కొందరు పనిగట్టుకుని సినిమాపై నెగిటివ్ టాక్ సృష్టించినా.. అవేవీ కలెక్షన్లపై ప్రభావం చూపలేకపోయాయి.తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ, విదేశాల్లో ఆర్ ఆర్ ఆర్ హవా కొనసాగుతోంది.

ఇక ఒక్క తెలుగు రాస్ట్రాల్లోనే ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ వీక్ లో 180 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'బాహుబలి 2' సినిమా మొదటి వారంలో 117.77 కోట్లు షేర్ అందుకొని.. లాంగ్ రన్ లో 153 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్లును ట్రిపుల్ ఆర్ తిరగరాస్తుంది.

తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ, విదేశాల్లో ఆర్ ఆర్ ఆర్‌ హవా కొనసాగుతోంది. తొలి మూడ్రోజుల్లో రూ.500 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్‌.. ఏడురోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లు గ్రాస్​ సాధించింది. కేవలం హిందీలోనే రూ.132 కోట్ల (గ్రాస్) మార్కును దాటినట్లు ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి.

  వాల్డ్‌వైడ్‌గా 15 వేల థియేటర్లలో ట్రిపుల్‌ ఆర్‌ సందడి. టార్గెట్‌ 2K ప్లస్‌ క్రోర్స్‌. బాహుబలి-2 కలెక్షన్లు 1810 కోట్లు. అంతకు మించిన రేంజ్‌లో ట్రిపుల్‌ ఆర్‌పై ఎక్స్‌ప్టేషన్స్‌. 2వేల కోట్లు వసూలు ఖాయమనే ది జక్కన్న అంచనా. ఈ అంచనా అక్షర సత్యమవుతుందని అంటున్నారు ఫిల్మ్ అనలిస్ట్స్‌.

ఈ సినిమాలోఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించారు. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చెర్రీకి జోడీగా ఆలియా భట్‌ నటించారు.సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించాడు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు.

ఓవరాల్‌గా వాల్డ్‌వైడ్‌గా 710 కోట్ల బిజినెస్‌ను ఇప్పటికే తన జేబులో వేసుకున్నారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 వేల థియేటర్లలో సినిమా విడుదల అంటే మాటలా. సగటున 4 ఆటలు.. ఎక్కువ తక్కువలు ఎలా వున్నా టిక్కెట్‌ ఒక్కంటికి 150 లెక్కన వేస్కున్నా.. వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించవచ్చు.

Related posts