telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ బీస్ట్’​ తెలుగు ట్రైలర్​ రిలీజ్‌..

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్, పూజా హెగ్దే జోడిగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. .

ఈ మూవీలో విజయ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించాడు. ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

తమిళ వెర్షన్‌తో పాటు, ఈ చిత్రం తెలుగులో కూడా ఏప్రిల్ 13న ఏకకాలంలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా బీస్ట్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో హీరో విజయ్ ధైర్యసాహసాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ ట్రైలర్‌లో షాపింగ్‌ మాల్‌ను హైజాక్ చేయ‌గా ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ వీర రాఘవన్‏గా దళపతి రంగంలోకి దిగుతాడు.

భయంకరమైన ఉగ్రవాదులతో పోరాడటం సినిమాపై హైప్ పెంచుతోంది. ట్రైలర్ పూర్తిగా ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

Related posts