telugu navyamedia
రాజకీయ

రేప్‌ బాధితుల కోసం ఉద్యమిస్తున్న మంజుల

అత్యాచార బాధితులకు ముఖ్యంగా దళిత మహిళలకు న్యాయం చేకూర్చే దిశలో సహాయపడేలా ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు 52 ఏళ్ల మంజుల. గత ముప్పై యేళ్లుగా దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మంజుల ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తుంది. ‘ఒక్కరు కాదు…అందరూ ఒక్కటై పోరాడాలి’ అనే నినాదం నుంచే పుట్టిన ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌’ ఆర్గనైజేషన్‌కు మంజుల సహ–వ్యవస్థాపకురాలు.”

దళిత సమాజం నుంచే మహిళా నాయకులు రావాలి. అలాంటి వారిని తయారుచేయాలన్నదే నా చిరకాల స్వప్నం అని, కోవిడ్ మహమ్మారి సమయంలో లైంగిక హింస కేసులను పరిశీలిస్తున్నప్పుడే, దీని కోసం ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించాల్సిన అవసరం ఉందని గ్రహించాను’’ అన్నారు మంజుల.

చారిత్రకంగా దళితులు సమాజంలో వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు. చట్టపరంగా వీరికి రక్షణ కల్పించినప్పటికీ, సంఘంలో పక్షపాతం, హింస ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా, భారతదేశ మహిళా జనాభాలో 16 శాతం ఉన్న దళిత మహిళలు అదనంగా లైంగిక హింసను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.దళితులను శిక్షించాలన్నా, అవమానించాలన్నా అత్యాచారం అనేది అగ్రవర్ణాల చేతిలో అయుధంగా తయారైంది. ‘‘లైంగిక హింసకు గురైన మహిళలు గౌరవంగా, హుందాగా జీవనం కొనసాగించడానికి సహాయపడే నాయకులు అవసరం. మా సంస్థ ద్వారా వారిని తయారుచేయాలన్నదే మా సంకల్పం” అన్నారామె.

The Dalit activist fighting for rape survivors - BBC News

మంజుల కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వలస వచ్చింది. తన తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు. మరోవైపు తాను స్కూల్లో కులవివక్షతను ఎదుర్కొనేది. ఎటు చూసినా బాధలు, అవమానాలు. అందుకే ఆమె ఇప్పుడు బాధితుల గొంతు అయింది. తనలాంటి గొంతులు గట్టిగా వినిపించడానికి వేదిక తయారుకావడంలో ఒకరైంది. మంజుల ప్రదీప్‌ జీవితంపై ‘బ్రోకెన్‌ కెన్‌ హీల్‌: ది లైఫ్‌ అండ్‌ వర్క్‌ ఆఫ్‌ మంజుల ప్రదీప్‌’ అనే పుస్తకం వచ్చింది.

అత్యాచార బాధిత‌రాలు భావన సైతం..
ఆమె నెరవేర్చుకున్న కల ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వుమెన్‌ లీడర్స్‌’ దేశవ్యాప్తంగా ఎంతోమంది వుమెన్‌ లీడర్స్‌ను తయారుచేసింది, అలాంటి వారిలో ఒకరు గుజరాత్‌కు చెందిన అలా ఆమె దగ్గర శిక్షణ పొందుతున్నవారిలో 28 ఏళ్ల భావన కూడా ఒకరు. ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, మడమ తిప్పకుండా పోరాడటమే కాదు, తనలాగే ఎంతోమంది ఉమెన్‌ లీడర్స్‌ తయారుకావడానికి ప్రేరణ అయింది.

భావనా నర్కర్ గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణంలో నివసిస్తారు. అక్కడి పేద దళిత మహిళలకు చదువు, ఉద్యోగ అవకాశాలు సుదూర స్వప్నాలు. భారతదేశంలో దాదాపు దళిత మహిళందరి ఇదే పరిస్థితీ.”లైంగిక హింసకు గురైనప్పుడు స్త్రీలు తీవ్ర ఆవేదనకు లోనవుతారు. కోపం, బాధ..తమకు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ, జరిగిన అన్యాయానికి గొంతెత్తి చెప్పేందుకు జంకుతారు. సొంత కుటుంబానికి కూడా చెప్పుకోలేరు. ఎందుకంటే, మన హక్కులేంటో మనకు తెలీవు. చట్టాల్లో ఏముందో తెలీదు” అని న‌ర్కార్ చెప్పారు . 2020 జనవరిలో మంజులా ప్రదీప్ ఒక దళిత మహిళల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు భావన విన్నారు. దాంతో, తన జీవితం పూర్తిగా మారిపోయిందని, న్యాయం అందుబాటులో ఉంటుందన్న నమ్మకం కలిగిందని ఆమె చెప్పారు.

The Dalit activist fighting for rape survivors - BBC News

‘చట్టం, న్యాయం గురించిన విషయాలు తెలిస్తే ప్రశ్నించే ధైర్యం వస్తుంది, పోరాడే స్ఫూర్తి వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక న్యాయవాది ఉండాలి…’ అంటూ దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ‘బేసిక్‌ లీగల్‌ నాలెడ్జి’ కోసం శిక్షణ ఇస్తుంది నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఉమెన్‌ లీడర్స్‌.

Related posts