టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు. అయితే.. జనవరి 26న ఖిలాడీ నుంచి అప్డేట్ పక్కాగా ఉంటుందని… అది కూడా ఆరోజు ఉదయం 10 గంటల ఎనిమిది నిమిషాలకు అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ వస్తుందని ప్రకటించింది చిత్ర యూనిట్. అది కూడా లుక్, పోస్టరో కాదు… ఏకంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా.. ఇటీవలె రవితేజ క్రాక్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
previous post
next post