telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను ట్విట్టర్ నుంచి వైదొలగడంతో సంబరాలు చేసుకుంటున్నారు : సోనాక్షి సిన్హా

Sonakshi-Sinha

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా ట్విట్టర్‌కు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో, దాని వల్ల ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది సోనాక్షి సిన్హా. “నేను ట్విట్టర్ నుంచి వైదొలగడంతో అందరూ ఏదో పెద్ద విజయం సాధించినట్లుగా సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి వారి విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఎవ్వరూ నన్ను, నా ఫ్యామిలీని టచ్ చేయలేని విధంగా నెగిటివిటీని కట్ చేశాను. ఇక ఈ విషయంలో విజేత ఒక్కరంటే ఒక్కరే ఉన్నారు. అది నేనే. మీ ప్రతికూలత నాకు లేదా నా జీవితానికి ఎన్నడూ సేవ చేయలేదు, అందువల్ల గత పది సంవత్సరాలుగా సంపాదించిన 16 మిలియన్ల మంది ప్రజలను వేలితో ఒక బటన్ నొక్కి వదులుకున్నాను. నన్ను ద్వేషించేవారందరికీ ఎంతో ప్రేమను, మంచి మనసును ఇమ్మని కోరుకుంటున్నాను. లేదు అదే ద్వేషంతో కొనసాగుతాను అంటే.. ఆ ద్వేషం నాకు చేరదని తెలుసుకోండి. ఇక నన్ను ప్రేమిస్తున్న వ్యక్తులు బాధపడతారని తెలుసు. దయచేసి మీ ప్రేమ మరియు మద్దతు నాకు తెలుసు. వాటిని మీరు ఎక్కడికి వెళ్ళినా.. మీకు వీలైనంత ఎక్కువ మందికి పంచమని మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికీ ప్రేమే సమాధానం” అని సోనాక్షి తన పోస్ట్‌లో పేర్కొంది. ‘‘నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే.. నువ్వు వెంటనే చేయాల్సింది నెగిటివిటీకి దూరంగా ఉండటం. ముఖ్యంగా ఈ కాలంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో.. నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉండండి” అంటూ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన లాస్ట్ ట్వీట్‌లో పేర్కొని.. ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Related posts