telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అక్షరమాలలు…

రాత్రయితే చాలు..
చీకటి కాగితమవుతుంది..
కిటికీ కలమవుతుంది..
చంద్రుడు పదమవుతాడు..
వెన్నెల భావమై నవ్వుతుంది..!
నేనేమో..
కలలను విడిచి..
కలతను కౌగిలించుకుని..
చుక్కలపందిరి కింద
కన్నీటికథనై కరిగిపోతాను..!
అచ్చులను ఆత్మీయంగా పలకరిస్తూ..
హల్లులను గాఢంగా హత్తుకుంటూ..
భావాలకు భాష్యాలను కూర్చుకుంటూ..
మదిలోనివేదన కరిగేంతవరకూ..
ఆనందం అర్ణవమయేంతవరకు..
అక్షరాన్నై కాగితంపై నర్తిస్తాను..!
తూరుపుఆకాశాన
వెలుగు కిరణం మొలిచి
వెచ్చగా నను స్పర్శించేటప్పటికి….
కమ్మనికవితనై నేను
ప్రాణం పోసుకుంటాను..!
నిదురలేచిన జగతికి బహుమతిగా..
అందమైన అక్షరమాలలను అందిస్తాను..!
జీవప్రదాత సూర్యునికి..
కృతజ్ఞతాసుమాలను నేను సమర్పిస్తాను….!!

Related posts