వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి.. మే నెలలో బ్యాంకుల్లో ముఖ్యమైన లావాదేవీలు ఏమైనా ఉంటే మాత్రం.. ఇప్పుడు చూసుకుంటే మంచిది.. ఎందకంటే.. ఏప్రిల్‌లో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.. ఇందులో 5 ఆదివారాలు (2, 9, 16, 23, 30 తేదీలు), 8వ తేదీ రెండో శనివారం, 22 వ తేదీ నాలుగో శనివారం మొత్తం ఈ 7 రోజులు సాధారణ సెలవులు కాగా.. మరోవైపు మే 1న మేడే, 7వ తేదీన జమాతుల్ విద, 13 న ఈదుల్ ఫితర్, 14న రంజాన్, 26 బుద్ధపూర్ణిమలు ఇలా.. మొత్తంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు 4 గంటలు మాత్రమే పనిచేస్తున్న సంగతి తెలిసిందే కాదా.. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్నారు… బ్యాంకులపై కూడా పని ఒత్తిడి ఉండడంతో.. అత్యవసరం అయితేనే బ్రాంచ్‌లకు రావాలని.. వీలైనంత వరకు డిజిటల్ పేమెంట్స్ చేసుకోవాలని సూచిస్తున్నాయి బ్యాంకులు.
previous post
next post
ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి