గత ప్రభుత్వ హయాంలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకొని పలువురిని మోసం చేసిన వ్యవహారాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైసీపీ అధికారలోకి రాగానే బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా రంజీ క్రికెటర్ నాగరాజు కు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేస్శారని ఫిర్యాదు చేశారు.
క్రికెటర్ నాగరాజు ఫిర్యాదు మేరకు కోడెల శివప్రసాద్, తనయుడు కోడెల శివరామ్ పై కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశారని నాగరాజు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
c