telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మిగులు రాష్ట్రంగా తెలంగాణ… లోటు రాష్ట్రంగా ఏపీ : 15వ ఆర్ధిక సంఘం

15వ ఆర్ధిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని… మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్న 15 వ ఆర్ధిక సంఘం… ఏపీకి రెవెన్యూ లోటు కింద 2021-26 లో 5 ఏళ్లకు గాను రూ.30,497 కోట్లు కేటాయింపులు చేసింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉంటుందని… 2021-26కు గాను ఏపీకి కేంద్ర పన్నుల్లో వాటా రూ. 2,34,113 కోట్లు కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా రూ. 1,09,786 కోట్లు కేటాయించింది ఆర్థిక సంఘం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా కేటాయించింది 15వ ఆర్థికసంఘం. 14వ ఆర్థిక సంఘం 42 శాతం సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 41శాతం సిఫార్సు చేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను గతంలో కన్నా ఒక శాతాన్ని తగ్గించింది 15 వ ఆర్ధిక సంఘం.

Related posts