telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

దోమలు కుడుతున్నాయా.. అయితే ఇలా చేయండి !

ప్రస్తుత బిజీ లైఫ్‌కి, వాహనాల సౌండ్స్‌కి, ఇంకా ఇతర కారణాల వల్ల మన వాతావరణం చాలా కలుషితం అవుతోంది. దీంతో వాతావరణంలో కీటకాలు, దోమలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే.. సహజంగా ప్రజలు ఎక్కువగా దోమల వలన చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ దోమలు కొంచం మురికి ఉంటేనే విపరీతంగా వస్తాయి. మనుషుల రక్తాన్ని పీల్చేస్తాయి. అయితే.. ఈ దోమలను ఇలా అరికట్టొచ్చు.
ఇంట్లో లేదా ఇంటి ప్రాంగణంలో కిటీకీల వద్దనో బంతిపూల మొక్కలను పెంచుకోండి. దీంతో దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు.
గదిలో కిటీకీలు, తలుపులు మూసి 10 నిమిషాలు కర్పూరాన్ని వెలిగించండి. ఆ వాసనకు కూడా దోమలు ఇంట్లో ప్రవేశించవు.
వెల్లుల్లి రసాన్ని నీళ్లలో కలిపి శరీరానికి పూసుకోవాలి. ఇలా చేస్తే కూడా దోమలు కుట్టవు.
కిటికీల వద్ద తులసి మొక్కలను ఉంచితే దోమలు రావు. అలానే లావెండర్‌ ఆయిల్‌తో వెలిగించిన దీపాలను గదుల్లో ఉంచినా దోమలు ఇంట్లో ప్రవేశించవు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే మురికి గుంటలు లేకుండా చూసుకోవాలి. లేకుంటే దోమలు గుడ్లు పెడతాయి. ఇంట్లో వెలుతురు, గాలి బాగా వచ్చేలా వెంటిలేషన్‌ ఉండేట్లు చూసుకోవాలి.

Related posts