వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డిస్కోరాజా”. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో చిరునవ్వు చిందిస్తూ విభిన్నమైన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 20, 2019న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్ ’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం వెన్నెల కిషోర్ “డిస్కోరాజా” షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో రవితేజతో దిగిన ఫోటోను కిషోర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. “క్యూరియస్తో ఫ్యూరియస్.. డిస్కోరాజా.. ఎందుకంత కోపం” అని ట్వీట్ చేశాడు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ తనదైన శైలి హాస్యంతో నవ్వులు పూయిస్తుంటాడు కమెడియన్ వెన్నెల కిషోర్. ఇటీవల విడుదలైన “మన్మథుడు-2”, “సాహో” సినిమాల్లో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇక గత కొంతకాలంగా రవితేజకు సరైన హిట్ లేదు. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి రవితేజ ఈ చిత్రంతోనైనా మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం.
previous post