telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాప్ సింగర్ స్మితకు కరోనా

Smitha

పాప్ సింగర్ స్మితకు, అలాగే ఆమె భర్తకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా స్వయంగా ఆమె తన ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘నిన్న చాలా ఇబ్బందికరమైన రోజు. బాగా ఒళ్లు నొప్పులు చేయడంతో, హెవీ వర్కవుట్స్ వల్ల ఏమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా రిజల్ట్‌లో వచ్చింది. పెద్దగా లక్షణాలు అయితే కనిపించలేదు. మేము ఇంటిపట్టునే క్షేమంగా ఉన్నా కూడా మా ఇంటిలోకి కోవిడ్ వచ్చి చేరింది. త్వరగా కరోనాని జయించి, ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను..’’ అని స్మిత తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా స్మిత మరియు ఆమె భర్త త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సెలబ్రిటీలు కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Related posts