telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిన్న రాత్రి మా ఇంటిని చుట్టుముట్టారు: అచ్చెన్నాయుడి భార్య

achennayudu tdp

నిన్న రాత్రి తమ ఇంటిని కొందరు చుట్టుముట్టారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి తెలిపారు. తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతుంతో అర్థం కాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచి పోయిందని ఆమె అన్నారు. . ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందని గుర్తు చేశారు.

రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని అన్నారు. ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. అర్థరాత్రి తరువాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారని తెలిపారు. ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లి పోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Related posts