telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భూమి గుండ్రంగా ఎలా తిరుగుతుందో చూపిస్తున్న అభిషేక్ బచ్చన్…

Abhishek

భూమి కదలికలపై ఓ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ వరసుగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. స్టన్నింగ్ అంటూ ఆయన నెటిజన్ చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేశారు. అతుల్ కబ్సేకర్ అనే నెటిజన్… ఓ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ చేసిన ఎక్సెప్షనల్ వీడియోను షేర్ చేశాడు. అందులో మనం భూమి గుండ్రంగా ఎలా తిరుగుతుందో అన్న విషయాన్ని గమనించవచ్చు. కెమెరా పాలపుంత ముందు స్టిల్ ఫ్రేమ్‌లో ఉంచాడు. ట్రాకింగ్ మౌంట్‌ను ఉపయోగించి ఫోటోగ్రాఫర్ మూడు గంటలపాటు … ప్రతీ 12సెకన్లకొక ఫోటోను క్లిక్ చేస్తూ వచ్చాడు. ఇందులో స్పష్టంగా భూమి తిరగడాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts