telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వెనక్కి తగ్గిన గని…?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. వరుణ్ తాజాగా చేసిన సినిమా గని. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను జులై30 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని మార్చేందుకు చూస్తున్నారు. అందుకు కారణం అదే సమయంలో భారీ సినిమా విడుదల కావడమే. కేజీఎఫ్2, రాధేశ్యామ్, పుష్ప సినిమాలు గని సినిమాకి అతి దగ్గర తారీకుల్లో విడుదల కానున్నాయి. కేజీఎఫ్2 జులై16, రాధేశ్యామ్ జులై30, పుష్ప ఆగస్ట్13న విడుదల కానున్నాయి. ఈ కారణంతో వరుతేజ్ గని సినిమాని సెప్లంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇతర హీరోలతో పోటీ పడకుండా సాదాసీదా రిలీజ్ కోసం గని టీమ్ చూస్తోంది. అందుకోసమే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చేందుకు ఫిక్స్ అయింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ చేస్తున్న మరో చిత్రం ఎఫ్3 ఆగస్ట్27న విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా తరువాత గని విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గని సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో త్వరలో తెలిస్తుందేమో వేచి చూడాలి మరి.

Related posts