telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐఎస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు .. ఆత్మహత్య చేసుకున్నాడు .. మేము చంపలేదు .. : ట్రంప్

is terrorist leader bukar suicide said trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు. ‘ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఉగ్ర సంస్థ ఐసిస్‌. దీని వ్యవస్థాపకుడు బాగ్దాదీ కోసం యూఎస్‌ ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతోంది. అతడిని వెతికి పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా సైన్యం పనిచేస్తోంది.

చివరకు యూఎస్‌ ప్రత్యేక కార్యదళాలు ఎంతో సాహసోపేతంగా దాడులు చేసి పనిని పూర్తి చేశాయి. ఈ దాడుల్లో భద్రతా దళాలు బాగ్దాదీ వెంట పడగా అతడు ప్రాణ భయంతో పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తాను పేల్చుకున్నాడు. చివరకు కుక్క చావు చవి చూశాడు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. చనిపోయే ముందు బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను హతమార్చాడని ట్రంప్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కొందరు బాగ్దాదీ అనుచరులు కూడా మరణించినట్లు చెప్పారు. అమెరికా సైనికుల్లో ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు.

Related posts