telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

students masks exams

విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం 9,10 తరగతుల విద్యాసంవత్సరం ఫిబ్రవరి 1నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ పాఠశాలలు ప్రారంభం పునః ప్రారంభకానున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే 26 మే 2021 కాగా… వేసవి సెలవులు 27-05-2021 నుండి 13.06.2021 వరకు ఉండనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలను 17.05.2021 నుండి 26.05 2021 వరకు నిర్వహించనుంది ప్రభుత్వం. అయితే… హాజరు శాతం తప్పనిసరి కాదని ప్రకటించింది విద్యాశాఖ. ఇది ఇలా ఉండగా.. ఫిజికల్ క్లాసులు 89 పనిదినాలు కాగా… డిజిటల్ తరగతులు 115 రోజులుగా ఉండనున్నాయి. 2020-21 విద్యాసంత్సరానికి 204 పని దినాలు ఉండనున్నాయి. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే… గ్రామీణ, పట్టణాల్లో 9.30 నుండి 4.45 వరకు కాగా… హైదరాబాద్ లో 8.45 నుండి 4 గంటల వరకు పాఠశాలలు నడువనున్నాయి. విద్యార్థుల హాజరుపై తల్లి దండ్రుల అనుమతి తప్పని సరి అని విద్యాశాఖ పేర్కొంది.

Related posts