ఇప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ నటీనటులంతా డిజిటల్ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లలో నటించడానికి సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియాకు ఆదరణ పెరుగుతోంది. ఈ డిజిటల్ మీడియాకు పెరుగుతున్నఆదరణను అనుసరించి పలువురు దర్శకులు, హీరోలు, హీరోయిన్స్, స్టార్ యాక్టర్స్ వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. కాగా… “బుజ్జిగాడు” చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ సంజన గల్రానికి తెలుగులో తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. అడపా దడపా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు “స్వర్ణ ఖడ్డం” అనే సీరియల్‌లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈమె ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించనుంది. అడల్డ్ కంటెంట్‌తో సాగే ఈ వెబ్ సిరీస్‌ను గీతాఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. అడల్ట్ కంటెంట్, అడల్ట్ జోక్స్ కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్ ఉంటుందని టాక్. ఓ కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడనేది సమాచారం. మరి దీనిపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల నుండి సమాచారం రాలేదు.
previous post
next post