telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ హీరోకు తీవ్ర‌గాయాలు ..విమానంలో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ తీవ్రంగా గాయపడ్డారు. గోవాకు విహార యాత్రలో తీవ్రంగా గాయపడ్డ అత‌న్ని గోవా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తక్షణమే అక్కడి నుంచి అతడిని విమానంలో బెంగళూరుకు తరలించారు. నటుడిని పరిశీలించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేసేందుకు ప్రక్రియకు మొదలు పెట్టామని తెలిపారు.

ఇటీవల భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన అతడు అక్కడ బీచ్‌లో ఫీట్స్‌ చేసిన కారణంగానే దిగంత్‌.. తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది.

దిగంత్ త‌ర‌చూ సైకిలింగ్‌, ట్రెక్కింగ్‌, సముంద్రంలో స్క్యూబా డైవింగ్‌ చేస్తుంటాడు. అంతేకాదు ఈ వీడియోలను తరచూ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తుంటాడు.

2006లో ‘మిస్​ క్యాలిఫోర్నియా’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘గాలిపాట 2’, ‘మారిగోల్డ్’​, ‘ఎవరు’, ‘థిమయ్య అండ్ థిమయ్య’ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

Related posts