telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స..ఫ‌లితాల‌ను చెక్ చేసుకోండి ఇలా

*ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..
*ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల చేసిన బొత్స‌..
*ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్ష రాసిన‌వారు 4,45,604 మంది
*సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష రాసిన‌వారు4,23, 455

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌  ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ఫలితాలను విద్యాశాఖ మంత్రి \ బొత్స స‌త్య‌నారాయ‌ణ మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఫలితాలు విడుదల చేశారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. ఇంటర్‌ ఫస్టియర్​లో 2,41,599 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. 

అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.

కాగా..ఈ నెల 25 నుంచి జూలై 5 వ‌ర‌కు రీకౌంటింగ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని, ఆగ‌స్ట్ 3 నుంచి సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు

పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Related posts