telugu navyamedia
తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్ విధ్వంసం కేసు: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృధ్వీ నిందితుడి అరెస్ట్‌

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళ‌న‌కారులు విధ్వంసమే సృష్టించిన విష‌యం తెలిసిందే . ఈ కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీగా తేల్చారు పోలీసులు.

ఆ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినకు పృథ్వీరాజ్ అనే యువ‌కుడు కూడా ఉన్నాడు.. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడు. ఆ దృశ్యాలను వీడియోలు కూడా తీయించుకున్నాడు.

విధ్వంసం అనంతరం వాటి వీడియోలను అతను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశాడు. పృథ్విని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృధ్వీ ఏ – 12  నిందితుడిగా ఉన్నాడు. అతనితో పాటు మరో తొమ్మిది మంది నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పృధ్వీకి వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. వీరందరిని రిమాండ్ కు తరలించనున్నారు

కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది. నరసరావుపేట నుంచి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి ఆవుల సుబ్బారావును తరలించారు. 10 మంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు ఆందోళన కారులు సహా ఇప్పటి వరకూ పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు.

Related posts