telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అలర్ట్ : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

rain hyderabad

తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు (7 వ తేదీ) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది వాతావరణ శాఖ. రేపు ఎల్లుండి (8,9 వ తేదీలు) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Related posts