telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వచ్చే నెల నుంచి డిజిటల్ క్లాసులు: సబితా ఇంద్రారెడ్డి

Sabitha indrareddy

కరోనా కారణంగా విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే డిజిటల్ తరగతులను నిర్వహించబోతున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులను ప్రారంభించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను తయారు చేసినట్టు తెలిపారు.విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై సర్వే చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రోజుకు మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్ క్లాసులు ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఒక్కో క్లాసు అరగంట నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే ఉండాలని చెప్పింది.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు.

Related posts