*రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్..
*అనేక ప్రాంతీయ పార్టీలక పుట్టుకకు కాంగ్రెస్సే కారణం..
*దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్
*కాంగ్రెస్ పెద్దల అహంకారంతోనే ఈ దుస్థతి వచ్చింది
*హేమంత్ సొరేన్, స్టాలిన్‌కి టీఆర్ ఎస్ డబ్బు పంపించింది వాస్తవం కాదా..
*టీఆర్ ఎస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆపర్ చేశారు
*రేవంత్ నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు
దేశంలో అంతరించిపోతున్నకాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని ఈటల రాజేందర్ సెటర్లు వేశారు.ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా గత ప్రవర్తన మరచిపోలేదని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలోకి మారిన రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో మాట్లాడుతున్నట్లు కన్పిస్తుందన్నారు. పిచ్చి భాష మాట్లాడితే ప్రజలు ఊరుకోరని ఈటల రాజేందర్ అన్నారు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగారని ఈటల రాజేందర్ అన్నారు. తమిళనాడులో స్టాలిన్‌కు, జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందని ఆరోపించారు. అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని ఈటల తెలిపారు. ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసునని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు.. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.దేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్ పార్టీనే. మోదీ పరిపాలన చూసే బీజేపీలోకి వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా, కాంట్రాక్టులు రద్దు చేసినా లొంగని వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని… అలాంటి నాయకుడి పట్ల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతరించిపోతున్న కాంగ్రెస్ లో ఉండాలని ఎవరనుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్