telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతు చట్టాలపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు !

kishanreddy on ap capital

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని.. కొందరు స్వలాభం కోసం రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త చట్టంలో ఎక్కడ IKP సెంటర్లను ఎత్తివేయాలని లేదని.. ప్రతిపక్షాలు తమ చేతగాని తనాన్ని కేంద్రంపై రుద్దుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అకారణంగా నిందలు మోపుతుందని.. గతంలో రైతులకు సంకెళ్లు వేశారన్నారు. కేంద్ర చట్టాల పట్ల రైతులు బాగా ఆలోచించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తామే గెలుస్తామని… టీఆరెస్ పైనా అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు. దానికి తాజా ఉదాహరణ జీహెచ్‌ఎంసీ ఫలితాలేనని.. ప్రజలు బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమేనని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
 

Related posts