telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ నుండి విడుదలైన మరో పాట…

దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌ గా ఇది తెరకెక్కుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రేక్షకులు తెరపై చూసి మూడు సంవత్సరాలు దాటింది. దింతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమూరుస్తున్నారు. అయితే ఇప్పటికే ‘వకీల్ సాబ్’ నుండి వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో పాట విడుదల చేసింది చిత్రబృందం. ”సత్యమేవ జయతే” అని సాగుతున్న ఈ పాటను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని సమాచారం. మరి ఈ సినిమా ఏం చేస్తుంది అనేది చూడాలి.

Related posts