telugu navyamedia
రాజకీయ వార్తలు

అధికారిక లాంఛనాలతో.. ముగిసిన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు

sheela dikshit

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాల మధ్య షీలా దీక్షిత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుండబోత వర్షం పడుతున్నా లెక్కచేయకుండా దివంగత నేత షీలా దీక్షిత్‌ కు కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో నిగమ్‌బోధ్‌ ఘాట్‌ కి తరలివచ్చారు.

యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాం‍ధీ, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్‌, రాజస్ధాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు దివంగత నేతకు నివాళులు అర్పించారు. మరోవైపు దివంగత నేతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ ట్వీట్‌ చేశారు.ఇక షీలా దీక్షిత్‌ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన మార్గదర్శకత్వాన్ని తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. కాగా షీలా దీక్షిత్‌ గుండెపోటుతో శనివారం మరణించిన సంగతి తెలిసిందే.

Related posts