telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే.. తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,170 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 44,160 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి రూ. 45,820 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 42,000 పలుకుతోంది.  బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.71,400 వద్ద ఉంది.

Related posts