telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రోజు రోజుకు పెరుగుతున్న కాల్‌ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య…

cyber attacks

హైదరాబాద్‌లో కాల్‌ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజే 80కి పైగా కేసులు నమోదయ్యాయి.  సైబరాబాద్, హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఒక్కరోజే వంద కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  డబ్బులు చెల్లించమని బూతులు తిడుతూ ఫోన్లు చేస్తున్నారు లోన్ యాప్ ప్రతినిధులు.  ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.  ఫోన్ లోని డాటాను యాక్సెస్ చేస్తున్నారు కేటుగాళ్లు. వీటిపై దృష్టిపెట్టిన పోలీసులు… నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. గతంలో చైనా నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరా తీస్తున్నారు. డబ్బులు వసూలు చెయ్యడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. దీంతో వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు బాధితులు.  గడిచిన  24 గంటల్లో దాదాపు 100 ఫిర్యాదులు నమోదయ్యాయి.  ఈ కేసుకు సంబంధించి దేశంలో మూడు ప్రదేశాల్లోని  కాల్  సెంటర్లు పై పోలీసులు దాడి చేశారు.  ఇప్పటి వరకు హైదరాబాద్లో  39, సైబరాబాద్ లో 120 , రాచకొండ 60 పైగా కేసులు నమోదయ్యాయి.

Related posts