telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

హైకోర్టు పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదు…

డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు, ఏపి హైకోర్టు సాధన సమితి కన్వీనర్‌ మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ హై కోర్టు పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదు అని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి ఏ విషయాన్ని అయినా తీసుకవెళ్లాలి. గవర్నర్ దృష్టి కి తీసుకువెళ్లారా లేదా అన్న విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలి. సీఎం తన లేఖలో న్యాయ సలహా తీసుకున్నామని తెలిపారు. అంటే అడ్వకేట్ జనరల్ సలహతోనే సీఎం లేఖ రాసినట్లుగా తెలుస్తోంది అన్నారు. ఇలాంటి సలహా ఇచ్చినందుకు ఏజి శ్రీరాం కు ఆ పదవిలో వుండే నైతిక హక్కు లేదు అని పేర్కొన్నారు. ఏజి శ్రీరాం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని అన్నారు.

హై కోర్టు న్యాయవాదుల సంఘం బైలాస్ ప్రకారం న్యాయవాదుల సంఘం లేనప్పుడు అడ్వకేట్ జనరల్ ఇన్ ఛార్జిగా వుంటారు. దీనితో ఏపీ హై కోర్టు న్యాయవాదుల సంఘం నిరసన బలంగా‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘ కాలం అఖిలభారత సర్వీస్ లో అజయ్ కల్లాం ప్రెస్ మీట్ పెట్టి సుప్రిం కోర్టుకు హై కోర్టుపై ఫిర్యాదు చేసిన విషయాన్ని చెప్పడం పై అభ్యంతరం ఉంది. ఢిల్లీ కి వెళ్లి వచ్చాక సీఎం జగన్ హైకోర్టు పై సుప్రీంకోర్టు కు ఫిర్యాదు చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం తో సంప్రదించాకే జగన్ సుప్రీంకోర్టు కు ఫిర్యాదు చేశారని అంతా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తో సీఎం జగన్ ఈ విషయం పై సంప్రదించకుంటే రాష్ట్ర ప్రభుత్వం పై‌ కేంద్రం చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగం ప్రకారం అది క్యాబినెట్ అంతా తీసుకున్నట్లు అవుతోంది. ఈ నిర్ణయానికి మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాలి అన్నారు.

Related posts