telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో ఐదు రోజులు .. భారీ వర్షాలు … అప్రమత్తంగా ఉండాలి.. : వాతావరణ శాఖ

5 more days rain in india

ఇప్పటికే దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తుంటే… వాతావరణ శాఖ మరో ఐదురోజులు ఈ ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసింది. ఉత్తర – పశ్చిమ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల నుంచి ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.

పశ్చిమ బెంగాల్, రాజస్దాన్ లలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 16న ఉదయం ఉత్తర- తూర్పు రాజస్థాన్, ఉత్తర- పశ్చిమ మధ్యప్రదేశ్, దక్షిణ- పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.

Related posts