ఏపీ రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని బిల్లులపై ప్రధాని కార్యాలయం ఆరా తీసినట్టు తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను కోరింది. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది.
ఈ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు ప్రస్తుతం రాజ్‌భవన్‌కు చేరాయి. ఈ రెండు బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…