telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మాస్క్ విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…

mask corona

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇవాళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీలో “కరోనా” వ్యాప్తి, నివారణ చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. “కరోనా” వ్యాప్తిపట్ల ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతతరుణంలో “కరోనా”వ్యాప్తిని నివారించాలంటే కఠినంగా  వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి మాస్కులు ధరించకుంటే 2000 రూపాయలు జరిమానా వింధించాలని ప్రభుత్వ నిర్ణయించింది.. చాలా మంది మాస్కులు పెట్టుకోవటంలేదని గ్రహించిన సర్కార్.. దీంతో.. జరిమానాను రూ. 500 నుంచి 2000 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది.  మరోవైపు “కరోనా” వల్ల ఈ సారి “చట్ పూజా” ఇంట్లో నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్… “చట్ పూజ” వల్ల “కరోనా” వ్యాప్తి చెందే అవకాశం ఉందని  ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు.. దేశ రాజధానిలో  “కరోనా” వ్యాప్తి నివారణకు థార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు. థార్మిక, స్వచ్ఛంద సంస్థలు నగరంలోని మార్కేట్లలో మాస్కులు పంచాలని సర్కార్ విజ్ఞప్తి చేసింది. “కరోనా”  విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related posts