మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు, గిద్దలూరు, డోన్, ఆత్మకూర్, పలమనేరు, మదనపల్లి, రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట, కనిగిరి, కొవ్వూరు మున్సిపాల్టీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని 20వార్డుల్లో 13 చోట్ల వైసీపీ విజయం సాదించింది. కాగా ఏపీ వ్యాప్తంగా కౌంటర్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ లోని పోస్టల్ బాక్సుల్లో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ఉన్న పత్రాలు కనిపించాయి. అయితే వాటిని వేరు చేసి కౌంటింగ్ చేస్తున్నారు అధికారులు.
previous post
next post