telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఏప్రిల్ 20 నుంచి అమెజాన్ లో అమ్మకాలు!

petition on amazon and flipkart on plastic usage

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు సైతం నిలిచిపోయాయి. ప్రపంచాన్నే ఓ చిల్లర అంగడిగా మార్చిన ఈ-కామర్స్ సంస్థలు లాక్ డౌన్ దెబ్బకు స్థంభించిపోయాయి. వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఈ నెల 20 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి పోర్టళ్లు తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అయితే పూర్తిస్థాయిలో విక్రయాలకు మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్ టాప్ ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్టేషనరీ వస్తువులు మాత్రమే విక్రయించేందుకు అనుమతిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ వరకు రెండో దశ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-కామర్స్ సంస్థలు తమ వాహనాలను రోడ్లపైకి తీసుకువచ్చేందుకు తగిన అనుమతులు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

Related posts