telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ రెబల్ స్టార్ స్టైలిష్ లుక్… పిక్ వైరల్

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, సత్యన్, శాషా ఛేత్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా లాక్‌డౌన్ తరవాత ఇటలీలో షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ముందుగా ప్రభాస్ అండ్ కో ఇటలీ వెల్లగా.. అక్టోబర్ మొదటి వారంలో పూజా హెగ్డే జాయిన్ అయ్యారు. ఇటలీ షెడ్యూల్ ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తాజాగా ఇప్పుడు అలానే మరో కొత్త ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘రాధే శ్యామ్’ డ్రెస్సింగ్ లోనే మెస్రాటి లగ్జరీ కారు పక్కన స్టైలిష్ గా నిల్చొని ఉన్న ఈ సరికొత్త ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు మరియు సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

Related posts