telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వపన్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్‌: షర్మిల

ys sharmila press meet

జనసన అధినేత వపన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.సోమవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పినట్టుగానే నటుడు నటిస్తాడు..వపన్ రాజకీయ సినిమాలో డైరెక్టర్‌ చంద్రబాబు చెప్పినట్టు పవన్ నటిస్తున్నాడని షర్మిల దుయ్యబట్టారు. అదే తరహాలోనే పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ సినిమాలో నటిస్తున్నాడని ఆమె విమర్శించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము థర్డ్ పార్టీ ఎంక్వైరీని కోరితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ నామినేషన్లు వేసే సమయంలో పచ్చ జెండాలు కూడ కన్పించాయని ఆమె గుర్తు చేశారు. పైకి మాత్రం తమ మధ్య ఎలాంటి పొత్తులు లేవని చెబుతున్న ఈ రెండు పార్టీలు అంతర్గతంగా సర్ధుబాటు చేసుకొన్నాయని ఆమె ఆరోపించారు. డేటా చోరీ విషయమై వైసీపీ ఇంతా మాట్లాడుతుంటే పవన్  ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

Related posts