కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇటు ప్రజలతో పాటు అటు ఎంతోమంది సెలెబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య తనయుడు ధృవ్ కరోనా బారిన పడ్డట్టు సింగర్ పేర్కొన్నారు. తన తనయుడు విదేశాలకి వెళ్ళాల్సి ఉన్న నేపథ్యంలో ముందుస్తు పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌గా తేలిందని అన్నారు. ప్రస్తుతం తన తనయుడు క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిజీత్ అన్నారు. ఇక తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని అభిజీత్ తెలిపారు.