telugu navyamedia
సినిమా వార్తలు

నాని శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్‌..

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నాని డ్యూయల్ రోల్‏లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల దీపావళి కానుకగా ఈ సినిమా నుంచివిడుదల చేసిన హీరోయిన్స్ లుక్ అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీలోని ‘రైజ్​​ ఆఫ్ శ్యామ్’​ ఫుల్ లిరికల్ పాట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుద‌లైంది.

శ్యామ్ సింగరాయ్.. అరే ఎగసెగిసిపడు అలజడివాడే శ్యామ్ సింగరాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈపాటలోని నాని ఓ ప్లాష్ బ్యాక్‏లో పవర్ ఫుల్ లీడర్‏గా ..అలాగే మాస్ లుక్‏లో క‌నిపిస్తున్నాడు. ఈ పాటను మిక్కి జే మేయర్ కంపోజ్ చేశారు. 

ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

Related posts