telugu navyamedia
సినిమా వార్తలు

మాస్ లుక్‌లో మెగ‌స్టార్‌..154వ మూవీ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి చేతి నిండా సినిమాల‌తో పుల్ జోరు మీద ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్‌ను పూర్తీ చేసుకుంది. అలాగే గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాయి. ఈ క్రమమంలోనే ఇప్పుడు మెగాస్టార్ 154 మూవీ కూడా మొదలైంది.

చిరంజీవి డైరెక్టర్‌ కె ఎస్‌ రవీంద్ర అలియాస్‌( బాబీ) దర్శకత్వంలో తన 154వ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా నుంచి చిరు లుక్ ను రిలీజ్ చేశారు. మెడలో పెద్ద గొలుసులు వేసుకొని స్టైల్‌గా లైటర్ పట్టుకున్న చిరు లుక్ అదిరిపోయింది. అరాచకం ఆరంభం అంటూ పోస్టర్‌ను వదిలారు మేకర్స్..ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Mega

కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది!! ..నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మెగాస్టార్‌తో కలిసి పని చేస్తున్నాను.. పద్దెనిమిదేళ్ల క్రితం.. ఆయన్ని మొదటి సారి కలిసిన రోజు కన్నకల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను” అంటూ బాబీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related posts