telugu navyamedia
రాజకీయ

అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు మనీలాండరింగ్ కేసులో ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక సెల‌వు కోర్టు శనివారం (నవంబర్ 6) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అతడిని మరో తొమ్మిది రోజుల పాటు రిమాండ్‌కు కోరింది, అయితే న్యాయస్థానం దర్యాప్తు సంస్థ విజ్ఞప్తిని తిరస్కరించింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది.

ముంబైలోని హోటళ్లు, బార్‌ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్ వాజ్‌ను హోంమంత్రి హోదాలో అనిల్‌ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రిపింది.

ఇందులో భాగంగా దేశ్‌ముఖ్‌ను 12 గంటల విచారణ తర్వాత నవంబర్ 1 అర్థరాత్రి ఈడీ అరెస్టు చేసింది. కోర్టు మంగళవారం అతడిని నవంబర్ 6వ తేదీ వరకు ఏజెన్సీ కస్టడీకి అప్పగించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ప్రత్యేక సెల‌వు కోర్టు ఎదుట హాజరుపరిచారు.

Related posts