వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన అందించిన కథతో రూపొందిన చిత్రం `బ్యూటిఫుల్`. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతుంది. సూరి, నైనా గంగూలి జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో వర్మ చాలా బిజీగా ఉంటున్నాడు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నైనా గంగూలీతో డ్యాన్స్ చేశాడు. ఆదివారం జరిగిన ప్రీ న్యూ ఇయర్ ఈవెంట్‌లోనూ మరోసారి వర్మ, నైనా డ్యాన్స్ శారు. అభిమానులు, పలువురు సినీ ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే వర్మ, నైనా కాళ్లు పట్టుకున్నాడు. వర్మ పనికి నైనా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తర్వాత ఆయన్ని పట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
previous post