సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో 20 రోజులు ముందుగానే…. అంటే జూలై 13 నుంచి ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టేశారు ఆయన అభిమానులు. #PSPKAdvBdayTrendOnJuly13th హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దేశంలోనే ట్విట్టర్ ట్రెండింగ్ స్టార్‌గా పవన్ కల్యాణ్ పేరు రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియన్స్ ట్వీట్స్ వచ్చాయంటే అభిమానుల ఏ రేంజ్‌లో చేలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ‘వకీల్‌సాబ్’తో పవన్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది అయన అభిమానులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.
previous post
next post