telugu navyamedia
సినిమా వార్తలు

వరల్డ్ ఫేమస్ లవర్ : నాలుగు పాత్రల్లో విజయ్…!

Vijay-Devarakonda

“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ త‌ర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్‌నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత “గీత గోవిందం”, “ట్యాక్సీవాలా” చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం “హీరో” అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. కానీ ఇంతవరకు ఈ సినిమా పేరు అనౌన్స్ చెయ్యలేదు. తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశాడు. “వరల్డ్ ఫేమస్ లవర్” అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్. నలుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కూడా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. కాలేజ్ స్టూడెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బైక్ రేసర్, మధ్య తరగతి వ్యక్తి పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Related posts