telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కేరళలో .. బీజేపీ ఇప్పుడప్పుడే.. అధికారంలోకి రాదు..

bjp leader comments on own party

కేరళలో బీజేపీకి సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత ఎదురవుతుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత చాలా ఇబ్బంది పెడుతుంది. తాజాగా ఆ పార్టీ నేత రాబోయే ఎన్నికల్లోనే కాదు.. సమీప భవిష్యత్ లోనూ బీజేపీ కేరళలో అధికారంలోకి రాబోదని తేల్చిచెప్పారు. కేరళ అసెంబ్లీలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న ఓ రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలాన్ని కలిగిస్తుంది.

కేరళలో నిరుద్యోగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ..‘కేరళను బీజేపీ పాలించడం లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ అధికారంలో లేదు. సమీప భవష్యత్తులో కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు అన్నారు. మన రాష్ట్రంలో జాతీయ సగటు కంటే నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండటంతో, యువతీయువకులు ఉపాధి కోసం వలస వెళుతున్నారు. ఇది వాస్తవం’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై మీడియా కేరళ బీజేపీ చీఫ్ శ్రీధరణ్ పిళ్లైను సంప్రదించగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తప్పించుకున్నారు. 2015 గణాంకాల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత 5 శాతం కాగా, కేరళలో 12 శాతంగా నమోదయిందని సమాచారం.

Related posts