telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ కు సుశాంత్ పేరు… నిజం కాదా…!

Sushanth singh rajput

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల 14న ఆయన బాంద్రాలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుశాంత్ మృతితో తోటి నటులు, ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే అమెరికాకు చెందిన ర‌క్ష అనే అభిమాని తానొక స్టార్‌ను కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరు పెట్టాన‌ని తెలియ‌జేస్తూ దానికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌ను కూడా జ‌త చేశారు. ర‌క్ష అభిమానానికి అంద‌రూ షాక‌య్యారు. అయితే ఇది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని తాజాగా అధికారులు స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ ఖ‌గోళ స‌మాఖ్య‌కు చెందిన ఓ శాస్త్ర‌వేత్త మాట్లాడుతూ ‘‘ప్ర‌పంచంలో ఏ సెల‌బ్రిటీ పేరునైనా న‌క్ష‌త్రాల‌కు పెట్టాలంటే ఆ హ‌క్కు అంత‌ర్జాతీయ స‌మాఖ్య‌కు మాత్ర‌మే ఉంటుంది. చాలా మంది త‌మ‌కు న‌చ్చిన పేర్ల‌ను తార‌ల‌కు పెట్టిన‌ట్లు ప్రచారం చేసుకుంటున్నారు’’ అని తెలిపారు. దీంతో న‌క్ష‌త్రానికి సుశాంత్ పేరుని పెట్టార‌న‌డంలో నిజం లేద‌ని అర్థమవుతోంది.

Related posts