telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వలస కార్మికులపై పుస్తకం రాయనున్న సోనూసూద్

Sonu-Sood

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో వేలాదిమంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపించి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన అనుభవాలతో ఒక పుస్తకం రాసేందుకు సోనూసూద్ ముందుకు వచ్చారు. ముంబైలో నా హృదయ స్పందనలను అక్షరీకరిస్తానని సోనూ చెప్పారు. యూపీ, బీహార్, జార్ఖండ్, అసోం, ఉత్తరాఖండ్ పలు ఇతర రాష్ట్రాల గ్రామాల్లోనూ తాను వలసకార్మికులైన కొత్త స్నేహితులను గుర్తించానని, వలసకార్మికులతో సంబంధాలు ఏర్పడ్డాయని సోనూ చెప్పారు. వలసకార్మికులతో తన అనుభవాలను శాశ్వతంగా పొందుపర్చేలా కథలను ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని నిర్ణయించుకున్నానని సోనూసూద్ వివరించారు. తాను రాసే ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురిస్తుందని సోనూసూద్ వెల్లడించారు. ‘‘గత మూడున్నర నెలలు నాకు జీవితాన్ని మార్చే అనుభవాలు మిగిలాయి. వలసకార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడుపుతూ వారి బాధలను పంచుకున్నాను. వారు ఇంటికి తిరిగి వెళ్లేటపుడు చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండింది. వలసకార్మికుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, వారి కళ్లలో ఆనందం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చింది. చివరి వలసకార్మికుడు కూడా వారి ఇంటికి పంపించే పనిని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాను. వలసకార్మికులకు సహాయం చేయడంలో నన్ను ఉత్ప్రేరకంగా మార్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని సోనూసూద్ వివరించారు. తాను వలసకార్మికులకు సహాయపడటం కోసం ముంబై నగరానికి వచ్చానని నమ్ముతున్నానని సోనూ చెప్పారు.

Related posts