కరోనా వైరస్ కారణంగా హీరో నితిన్ పెళ్లి కూడా వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరో నితిన్ నిశ్చితార్థం షాలినితో ఫిబ్రవరి 15న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెండు దశాబ్దాలుగా ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డా.సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినీని నితిన్ మనువాడబోతున్నాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించాలని ప్లాన్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అరబ్ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో దుబాయ్‌లో జరగాల్సిన నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది. అప్పటికి కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తే దుబాయ్‌లో.. లేకుంటే హైదరాబాద్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌజ్‌లో వివాహం జరిపించేందుకు వధూవరుల బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోతే హైదరాబాద్ శివారులో పెళ్లి జరిపించి ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.
previous post
“సాహో” రిజల్ట్ పై ప్రభాస్ స్పందన