సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇటీవలే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.మహేష్ బాబు ఈ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఆదివారం (మార్చి 8) మహిళా దినోత్సవం సందర్భంగా ‘హీ ఈజ్ సో క్యూట్’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దేవి ట్యూన్‌కి శ్రీమణి లిరిక్స్ రాయగా మధుప్రియ ఈ పాట పాడింది. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు.మహేష్, వెంటపడుతూ రష్మిక చేసిన అల్లరి, వేసిన బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ భలే ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ వీడియో సాంగ్ మీరు కూడా వీక్షించండి.
previous post
next post