telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున మరో డేరింగ్ స్టెప్… ‘వైల్డ్ డాగ్’ కోసం కెమెరా ముందుకు…!

Wild-Dog

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, షూటింగ్స్ బంద్ కావడంతో సెలబ్రిటీలంతా వారి వారి ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నారు. దాదాపుగా 5 నెలలకు పైగా ఇదే పరిస్థితి. కొన్నిరోజుల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కి పర్మిషన్స్ ఇచ్చినా సెట్స్ మీదకు రావడానికి నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున సాహసం చేస్తూ డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు. నిన్న (సెప్టెంబర్ 3న) నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌ సెట్స్ మీదకు వచ్చేశారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. మేక‌ప్‌మెన్‌లు, హెయిర్‌స్టైలిస్ట్‌లు ఫేస్ మాస్క్‌లు ధ‌రించి త‌మ తమ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇకపోతే అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని గతంలోనే కొంతభాగం కంప్లీట్ చేసి తిరిగి 6 నెలల తర్వాత రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. ఇందులో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తుండగా, దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ‘వైల్డ్ డాగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బుల్లితెర భారీ రియాలిటీ షో బిగ్ బాస్ తెరపై సందడి చేయబోతున్నారు నాగార్జున.

Related posts